ఎమ్మెల్సీ అనంతబాబును రిమాండ్ కోరుతూ నేడు పిటిషన్

సాక్షులను బెదిరించిన కేసులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీస్ కస్టడీకి కోరుతూ సర్పవరం పోలీసులు నేడు కాకినాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. గతంలో అధికార పరిధిపై రాజమండ్రి, కాకినాడ కోర్టుల మధ్య నెలకొన్న సందిగ్ధతతో జాప్యం జరిగింది. తాజాగా పోలీసులు మరోసారి పిటిషన్ వేయాలని నిర్ణయించారు. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్