యర్రగోటి పాలెంలో పులి బీభత్సం: రెండు గేదెలు మృతి, భయాందోళనల్లో ప్రజలు

రాజానగరం నియోజకవర్గంలోని యర్రగోటి పాలెంలో పులి సంచారం కలకలం రేపింది. కేశవరం సమీపంలో పులి అడుగులను అధికారులు గుర్తించారు. ఈ పులి దాడిలో రెండు గేదెలు మృతి చెందాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు పొలాల్లోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. పుణ్యక్షేత్రం సమీపంలోని పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. అధికారులు పులి సంచారాన్ని అంచనా వేస్తూ, నివారణ చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్