కాకినాడ జిల్లాలో సీనియర్ నాయకుడు పుల్లెల సుబ్రహ్మణ్యం డయాలసిస్ చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్ర కన్వీనర్ శీర రమేష్, కాళ్ళూరి కృష్ణమోహన్, మహ్మద్ రియాజ్, యార్లగడ్డ శ్రీనివాస్ తదితరులు ఆయనను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కార్యకర్తల కష్టసుఖాలలో పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు.