టీటీడీలో నెయ్యి కొనుగోళ్లపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం కాకినాడలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీ నెయ్యి వెయ్యి రూపాయలకు పైగా ఉన్నప్పుడు, గత వైసీపీ ప్రభుత్వం రూ. 420కే ఎలా కొనుగోలు చేసిందని ఆయన ప్రశ్నించారు. గేదెలు లేని సంస్థల నుంచి నెయ్యి సేకరించడంపై దుయ్యబట్టారు. ఫ్లెక్సీలు చింపడం వైసీపీ నేతల చేతకానితనమని తెలిపారు.