మచిలీపట్నం-కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో తుఫాను తీరం దాటడంతో, ఉమ్మడి గోదావరి జిల్లాలో రాత్రి 2 గంటల నుంచి భీకర గాలులు వీస్తున్నాయి. దీనితో ముందస్తు చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు, దీంతో అనేక ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. కూలిపోయే స్థితిలో ఉన్న చెట్ల కింద ఎవరూ నిలబడొద్దని అధికారులు సూచించారు. మీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితిని కామెంట్ చేయమని కోరారు.