వేలంగికి చెందిన టెక్కలి వీరకన్య భవాని హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన అంతర్జాతీయ కీబోర్డ్ ప్రదర్శనలో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన 2 వేల మంది వాయిద్యకారులు పాల్గొని గంటపాటు వాయించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ప్రతిభ కనబరిచిన 777 మందిలో భవాని వరుసగా రెండోసారి గిన్నిస్ అచీవర్స్ మీట్‌కు ఎంపికైంది. ఆమె విజయంపై గ్రామస్థులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.