రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కాజులూరు మండలం కోలంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వినకోటి కొండబాబు (36) అనే వ్యక్తి మృతి చెందారు. పొల మూరుపాడుకు చెందిన కొండబాబు, కోలంక నుంచి పొలమూరుపాడుకు వెళ్తుండగా, స్థానిక అటుకుల మిల్లు సమీపంలో ద్రాక్షారామ నుంచి యానాం వైపు వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో కొండబాబు అక్కడికక్కడే మరణించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొల్లపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్