నీలపల్లిలో యువకుడు మిస్సింగ్... కేసు నమోదు

తాళ్లరేవు మండలం నీలపల్లికి చెందిన పాలెపు దుర్గాప్రసాద్ (20) ఏప్రిల్ 22 నుంచి అదృశ్యమయ్యాడు. ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు తిరిగి రాకపోవడంతో తల్లి ఈశ్వరి ఫిర్యాదు మేరకు కోరంగి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. యువకుడి ఆచూకీ తెలిసిన వారు రూరల్ సీఐ 9440796521, 9440796558 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్