ఆలమూరు: 'కూటమి ప్రభుత్వంలో ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం'

కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. సోమవారం ఆలమూరు మండలం చొప్పెల్లలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ప్రతీ నెలా మొదటి రోజు నుంచే తెల్లవారుజామున పింఛన్లు అందించే విధానం నిరుపేదలకు భద్రత, భరోసా కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో 52 కొత్త పింఛన్లు మంజూరు చేయబడినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్