ఖేలో ఇండియాలో ఏపీ సెపక్ తక్రా జట్టుకు రజతం

గుజరాత్‌లోని డామన్ అండ్ డయ్యూలో జరిగిన రెండవ ఖేలో ఇండియా గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ సెపక్ తక్రా జట్టు రజత పతకాన్ని సాధించింది. ఉత్కంఠభరితమైన ఫైనల్లో బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. ఏపీ జట్టులోని దేవరపల్లి క్రీడాకారులు లక్కా గణపతి, పాటంశెట్టి సాయిల ప్రతిభను సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరు రామారావు, హరికృష్ణ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్