ఆత్రేయపురం: విధి నిర్వహణలో ఉన్న లైన్‌మెన్‌పై దాడి

ఆత్రేయపురం సెక్షన్ పరిధిలోని అంకంపాలెంలో ఆదివారం విధి నిర్వహణలో ఉన్న లైన్‌మెన్ కె. నారాయణ ప్రసాద్‌పై ఓ వినియోగదారుడు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి, సొమ్మసిల్లి పడిపోయిన ప్రసాద్‌ను తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, మాట్లాడలేని స్థితిలో ఉన్నారని సమాచారం. దాడికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉండగా, ఈ ఘటన విద్యుత్ సిబ్బందిలో ఆందోళన రేకెత్తించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్