అవినీతి బురదలో కూరుకు పోయిన వైసీపీ నాయకులు తమ బురదను ప్రజారంజకంగా పాలిస్తున్న కూటమి ప్రభుత్వంపై చల్లాలని చూస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండిపడ్డారు. శుక్రవారం ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మోసాల జగన్ అవినీతి కేసుల్లో త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.