ఆలమూరు మండలం చొప్పెల్లలో డీసీఎంఎస్ ఛైర్మన్ మెర్ల గోపాలస్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే టీడీపీ ‘మహానాడు’ వేడుకలను నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు వీక్షించేందుకు వీలుగా చెముడులంకలోని శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో భారీ ఎల్‌ఈడీ (LED) స్క్రీన్లతో ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ మహానాడును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.