ఈతకోటలో రూ. 1. 62 కోట్లతో అభివృద్ధి పనుల జోరు

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. సోమవారం ఈతకోటలో రూ. 1. 62 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఇందులో ఉపాధి హామీ నిధులతో రూ. 80 లక్షల సీసీ రోడ్లను ప్రారంభించగా, రూ. 82 లక్షలతో నిర్మించనున్న బి. టి. రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా 'చెత్త ఇవ్వండి-సరుకులు తీసుకోండి' కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్