ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం ‘ధర్మపథం’ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన ఆధ్యాత్మిక నృత్యాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. శనివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అధికారులు భద్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.