కొత్తపేట నియోజకవర్గంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు గురువారం రూ. 55,27,455 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. ఆలమూరులో 32, కొత్తపేటలో 25, రావులపాలెంలో 24, ఆత్రేయపురంలో 19 మందికి ఈ ఆర్థిక సహాయం అందింది. ఇందులో 93 రీయింబర్స్‌మెంట్, 7 ఎల్‌ఓసీ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆపద సమయంలో సీఎం సహాయనిధి పేదలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్