ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో ఉన్న ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో చక్రధరరావు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.