భక్తిశ్రద్ధలతో వాడపల్లి వేంకటేశ్వర స్వామి తొలిహారతి

ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం తొలిహారతి సేవలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, శాస్త్రోక్తంగా పూజాధికారాలు నిర్వహించి తొలిహారతి సమర్పించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్