వాడపల్లిలో తెప్పోత్సవం, చక్రస్నాన ఏర్పాట్ల పరిశీలన

ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం జరగనున్న తెప్పోత్సవం, గురువారం నాటి చక్రస్నాన ఏర్పాట్లను డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు బుధవారం పరిశీలించారు. గోదావరి తీరంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వామి వారి తెప్పోత్సవం కనుల పండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్