బుధవారం, రాజమండ్రి ఇంటెలిజెన్స్ ఎస్‌పి కె. ఎన్. రావు తన కుటుంబ సభ్యులతో కలిసి కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వారు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఎస్‌పికి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.