కోనసీమలో ప్రముఖ జబర్దస్త్ నటి వర్ష శుక్రవారం సందడి చేశారు. ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ జబర్దస్త్ నటి వర్ష దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.