కోనసీమ: 'మట్టి పాత్రల తయారీని ప్రోత్సహించాలి'

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయంగా మట్టి పాత్రల తయారీని ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. బుధవారం అమలాపురంలోని కలెక్టరేట్ లో జిల్లా వ్యాప్తంగా ఉన్న కుమ్మరి కులస్తులతో సమావేశం నిర్వహించి పర్యావరణ హితమైన మట్టి పాత్రలు తయారీకై చేపట్టాల్సిన చర్యల కోసం సమీక్షించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో మట్టి పాత్రల ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్