కోనసీమ: గురువు కాళ్లు మొక్కిన ఎమ్మెల్యే

త్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తన గురుభక్తిని చాటుకున్నారు. అక్కడ తనకు విద్య నేర్పిన మాజీ ప్రిన్సిపాల్ కంకటాల సత్యనారాయణను చూడగానే, ఎమ్మెల్యే ఆయన పాదాలకు నమస్కరించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా గురువులను మరువరాదని, వారి పట్ల విధేయత కలిగి ఉండాలని ఆయన ఈ సందర్భంగా నిరూపించారు. ఎమ్మెల్యే చూపిన ఈ వినమ్రత అక్కడి విద్యార్థులకు, నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది.

సంబంధిత పోస్ట్