కొత్తపేట: తుఫాన్ వల్ల అన్నదాతలకు తీరని నష్టం: ఎమ్మెల్యే

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మొంథా తుఫాన్ కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరిగినప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో తీసుకున్న ముందస్తు చర్యల వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి పెద్ద ఇబ్బందులు కలగలేదని తెలిపారు. పూరిగుడిసెలు, రేకుల షెడ్లు, శిథిల భవనాల్లో నివసిస్తున్నవారిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణ నష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్