ఆదివారం రావులపాలెంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, సీఎం రిలీఫ్ ఫండ్ కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందజేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 62 మంది లబ్ధిదారులకు రూ. 38, 68, 430 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.