కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో కాపు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి మెరిట్ విద్యార్థులు, డీఎస్సీ విజేతలకు సత్కార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు 12 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సోమవారం స్కాలర్‌షిప్‌లు అందజేశారు. సంఘం నిర్ణయించిన రూ. 3,500లకు అదనంగా తన సొంత నిధుల నుంచి రూ. 1,500 కలిపి, ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించారు. కుల సంఘాలు సామాజిక, విద్యాభివృద్ధికి వేదికలుగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పదోన్నతి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులను కూడా సత్కరించారు.