కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు

కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు, కూటమి శ్రేణులకు, ప్రభుత్వ అధికారులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, సుభిక్షతను తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రజలు అండగా నిలిచి, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్