వానపల్లి గ్రామంలో ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్నారన్న వార్తతో గ్రామంలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. గాంధీబొమ్మ కూడలి దగ్గర 30 అడుగుల లోతైన గోతిలో గత నాలుగు రోజులుగా పూజలు జరిపారు. అనుమానం వచ్చిన గ్రామస్థులు ఆరుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై సురేంద్ర కేసు నమోదు చేసి, వారి ఉద్దేశం ఏమిటనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.