కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటైన నేపథ్యంలో కొత్తపేటలో నూతనంగా చేపట్టనున్న ఆర్డీవో కార్యాలయ నిర్మాణం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం అనువైన స్థల సేకరణకై మార్కెట్ యార్డ్ వద్దనున్న సుమారు 3 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం పరిశీలించారు. ఆర్డీవో శ్రీకర్, స్థానిక అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.