వైసీపీ హయాంలో గ్రామాల్లో సైతం అశాంతి నెలకొని ఉండేదని, రాష్ట్రమంతా ఒక భయానక వాతావరణం వ్యాపించి ఉండేదని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రశాంతత నెలకొందని, రాష్ట్ర అభివృద్ధికి భరోసా లభించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట మండలం పలివెలలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.