బడుగువానిలంకలో అయ్యప్ప స్వామి గోదావరి ఆరాట్టు

ఆలమూరు మండలం బడుగువానిలంకలో బుధవారం శ్రీ అయ్యప్ప స్వామి వారి గోదావరి ఆరాట్టు మహోత్సవం, 6వ ఉత్తర నక్షత్ర జన్మదిన వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. శబరిమల పంపా ఆరాట్టు తరహాలో గోదావరి తీరంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్