ఈతకోటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు 'ప్రజాదర్బార్'

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం రావులపాలెం మండలం ఈతకోటలో 'ప్రజాదర్బార్' నిర్వహించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఒక వారధిలా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి 32 అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తీర్చడమే నిజమైన పరిపాలన అని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్