కొత్తపేట నియోజకవర్గ టాపర్లకు ఎమ్మెల్యే ప్రశంసలు

గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కొత్తపేట నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రాణించడంపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టాపర్లుగా నిలిచిన వి. గాయత్రి (592), కె. టి. రమ్య (588), బి. మౌనిక (584), కె. శైలు (584)లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వాడపాలెం కార్యాలయంలో తనను కలిసిన వానపల్లి విద్యార్థిని రమ్యను ఎమ్మెల్యే సత్కరించి, స్వీట్లు అందజేసి ఆశీర్వదించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్