కొత్తపేటలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

కొత్తపేట నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక బస్టాండ్ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఏపీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ఆదర్శనీయమని ఎమ్మెల్యే బండారు అన్నారు. వెనుకబడిన వర్గాల రాజకీయ ఎదుగుదలకు ఆయన కృషి అజరామరమని అనంత కుమారి కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్