ఆత్రేయపురం పరిధిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’

కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కొత్తపేట డీఎస్పీ మురళీ మోహన్ నేతృత్వంలో ఇళ్లు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితుల వివరాలు సేకరించారు. గంజాయి, మత్తు పదార్థాల రహిత సమాజమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం కోరుతూ, అసాంఘిక శక్తుల సమాచారముంటే 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు తెలపాలని సూచించారు.

సంబంధిత పోస్ట్