కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, తీవ్ర అనారోగ్యంతో వచ్చిన కాసర చిన్న సత్యనారాయణ (52) ప్రాణాలను కాపాడారు. డ్యూటీ డాక్టర్ ఎం. వీరబాబు, సకాలంలో స్పందించి ఖరీదైన 'టెనెక్టెప్లేస్' ఇంజెక్షన్ ఇవ్వడంతో బాధితుడు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. నర్సింగ్ సిబ్బంది సామ్రాజ్య కుమారి, హజరా బీబీ, భారతి కూడా చికిత్సలో కీలక పాత్ర పోషించారు. అత్యవసర సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టిన వైద్య బృందానికి బాధితుడి కుటుంబ సభ్యులు ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు.