రావులపాలెంలో శుక్రవారం జరిగిన ఓటర్ల జాబితా సవరణ అవగాహన సదస్సులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడారు. డీఎస్సీలో మంత్రి లోకేష్ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని చిర్ల జగ్గిరెడ్డి సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించి మహానాడు పేరుతో ఆడంబరాలు చేస్తోందని విమర్శించారు. గోదావరి కాలుష్యంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ తీసుకున్న చర్యలేంటని ప్రశ్నిస్తూ, రాబోయే పుష్కరాల్లో గత చంద్రబాబు ప్రభుత్వ హయాం నాటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పవన్ దృష్టి సారించాలని సూచించారు.