రావులపాలెం: ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే

రావులపాలెం మండలం కొమరాజులంకలో శనివారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇంటింటికీ వెళ్లి 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్లను అందజేశారు. దేశానికే ఆదర్శంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, కొత్తపేట నియోజకవర్గంలో 42,069 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 18.30 కోట్ల పింఛన్ల నగదు పంపిణీ చేస్తున్నామని, సంక్షేమంతో పాటు అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్