వైసీపీ కోనసీమ అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని పోలీసులు విడుదల చేశారు. రావులపాలెం మండలం రావులపాలెం-వేదిరేశ్వరం రోడ్డులో ఒక విగ్రహం ఏర్పాటు సందర్బంగా తలెత్తిన వివాదం నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగ్గిరెడ్డిని పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు స్టేషన్ వద్దకు భారీగా చేరుకోవడంతో చర్చలు అనంతరం చిర్లను విడుదల చేశారు.