రావులపాలెం: లారీ ఢీకొని యువకుడు మృతి

కొత్తపేట మండలం గంటి గ్రామంలోని చినపేటకు చెందిన యడ్ల సుభాష్(24) బుధవారం ఇంటినుంచి గోపాలపురం పనిమీద ద్విచక్రవాహనంపై వస్తుండగా స్థానిక పెట్రోలు బంకు సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కొత్త పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్