కొత్తపేట మండలం మందపల్లిలోని శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం వేకువజాము నుంచే ప్రత్యేక తైలాభిషేకాలు, పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ ఈవో సురేశ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ పవిత్ర దినాన దేవస్థానానికి దాదాపు రూ. 30 లక్షల ఆదాయం సమకూరింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు, విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.