ఆలమూరులో అంగరంగ వైభవంగా శ్రీ జనార్ధన స్వామివారి కళ్యాణం!

ఆలమూరు మండలం కేంద్రంలో బుధవారం రాత్రి శ్రీ జనార్ధన స్వామివారి దివ్య తిరు కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ఈ వివాహ వేడుకను వీక్షించేందుకు ఆలమూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గ్రామ పురవీధులు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి.

సంబంధిత పోస్ట్