వాడపల్లిలో వైభవంగా శ్రీ స్వామివారి తెప్పోత్సవం

కోనసీమలోని వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. సాయంత్రం గౌతమి గోదావరి నదిలో స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. ఉదయం నుండి స్వామివారికి విశేషార్చనలు, హోమాలు నిర్వహించగా, సాయంత్రం జరిగిన తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్