కొత్తపేటలో అకస్మాత్తుగా దట్టమైన పొగమంచు

కొత్తపేట మండలవ్యాప్తంగా సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. వేసవి ఎండలు మండుతున్న సమయంలో అకస్మాత్తుగా మంచు కురవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. తెల్లవారుజామున పరిసరాలన్నీ మంచుతో ఆహ్లాదకరంగా మారడంతో ప్రజలు ఈ దృశ్యాలను ఆసక్తిగా చూశారు. వాతావరణంలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పుల వల్లే ఈ వింత పరిస్థితి ఏర్పడి ఉంటుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్