ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి సన్నిధిలో సోమవారం ఆలయ అధికారులు ఆదాయ వివరాలను వెల్లడించారు. వివిధ సేవా టిక్కెట్లు, ప్రసాదాల విక్రయం, విరాళాల ద్వారా శ్రీవారికి మొత్తం రూ. 5,62,698 ఆదాయం సమకూరింది. అన్నదాన కార్యక్రమాల కోసం రూ. 2.77 లక్షలు, దర్శన టిక్కెట్ల ద్వారా రూ. 1.15 లక్షలు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 61 వేలకు పైగా ఆదాయం లభించింది. భక్తులు సమర్పించిన ఆన్‌లైన్ కానుకల ద్వారా రూ. 67,718 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.