వాడపల్లి శ్రీవారి ఆలయ మూసివేత: రేపు ఉ 9 గంటల వరకే దర్శనాలు

చంద్రగ్రహణం కారణంగా, కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మార్చి 3, మంగళవారం ఉదయం 9 గంటలకే మూసివేయనున్నట్లు ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు సోమవారం తెలిపారు. మార్చి 4, బుధవారం ఉదయం సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం 6 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనాలు యథావిధిగా ప్రారంభమవుతాయి. భక్తులు ఈ సమయాలను గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్