కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం (మే 30) ఒకే రోజు వివిధ సేవా టిక్కెట్లు, విరాళాల ద్వారా రూ. 61,68,979 ఆదాయం లభించింది. ఈ రోజు స్వామివారిని సుమారు 78,283 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆన్‌లైన్, విశిష్ట దర్శనాలు, వేద ఆశీర్వచనం, ప్రత్యేక దర్శనాలు, లడ్డు ప్రసాద విక్రయాల ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరింది. వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన శిబిరాల ద్వారా 712 మంది భక్తులు ఉచిత వైద్య సేవలు పొందారని ఆలయ వర్గాలు తెలిపాయి.