వాడపల్లిలో వైభవంగా వేంకన్న రథోత్సవం

కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారు దేవేరులతో కలిసి రథంపై భక్తులకు దర్శనమివ్వగా, వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణతో పులకించిపోయారు. భక్తులు రథాన్ని లాగి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవం ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభను సంతరించింది.

సంబంధిత పోస్ట్