పెళ్లి భోజనంతో 20 మందికి ఫుడ్ పాయిజన్

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి రామ్మోహనరావు పేటలో గురువారం జరిగిన ఒక వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి భోజనం తిన్న సుమారు 20 మందికి ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన బాధితులను వెంటనే వానపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అనంతరం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులందరూ క్షేమంగా ఉన్నారని, పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్