ఆత్రేయపురం మండలం లొల్ల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్న విశాఖపట్నానికి చెందిన నాగఅపర్ణ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జవగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. నాగఅపర్ణకు ఎడమ చేతి నాలుగు వేళ్లు తెగిపడ్డాయి. రాజమహేంద్రవరంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.